శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
స్ప్తవర్ణాల సింగిడి 17/8/2020
అంశం-:కవనసకినం
శీర్షిక-:శరణు శరణు వరుణదేవ
రచన-:విజయ గోలి. గుంటూరు
యజ్ఞాలతో ..యాగాలతో ..
పిలిచిన..చిన్న చూపు చూసావు
నమ్ముకుంటే కుండపోతవయ్యావు..
నారుపోసి నీరిస్తావని ఆశపడే కళ్ళకు
ఆరని తడి ఇచ్చావు
కసి ఎందుకు మాపైన …
కరోనాకు తోడైనావా..దేవా
శరణు శరణు వరుణా..ఆగిపోవా ..