హరివిల్లు లో విరిజల్లుగ

10 గజల్ రచన -విజయ గోలి

హరివిల్లులొ విరిజల్లుగ కురవాలని  ఉన్నదిలే
నిన్నలన్నీ నేడులాగ  గడపాలని  ఉన్నదిలే

అలకలలో నీమోమున ముకుళించెనె  కలువభామ
కన్నకలలు  బహుమతిగా కోరాలని  ఉన్నదిలే

చీకటనీ త్రోసేయకు మమతలలో వెలుగున్నది
నీయెదపై సేదతీరి ఒదగాలని ఉన్నదిలే..

చిరుగాలికి వణికిపోతె గాలివాన కరుణించదు
తోడునీడ నీవుగానె బ్రతకాలని ఉన్నదిలే

జాబిల్లిని వీడదుగా వెన్నెలమ్మ (ఏనాటికి)విజయమేగ
విలువలెపుడు వీగిపోవు కలవాలని ఉన్నదిలే *

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language