గజల్9 రచన-విజయ గోలి
జీవితమే కావ్యముగ రాయాలని నాకున్నది
బ్రతుకంతా కధలాగే చదవాలని నాకున్నది
కోయిలనై పాటలెన్నొ పాడాలని నాకున్నది
ఊహలలో ఊయలలే ఊగాలని నాకున్నది
కలతలన్నీ కలల్లాగా తొలగాలని నాకున్నది
మబ్బులలో నీరులాగ మలగాలని నాకున్నది
కొలనులోన దీపాలే విడవాలని నాకున్నది
పసిపాపగ జడివానలో తడువాలని నాకున్నది
తారలలో జాబిల్లిగ మెరవాలని నాకున్నది
విలువలతో విజయంగా మురవాలని నాకున్నది