8గజల్. రచన – విజయ గోలి
మోమున నవ్వులు మెరిసిన భోగం కాదా
మనసున దేవుని నిలిపిన యోగం కాదా
అహమున రేగితె మనిషికి విలువేముందిలె
ఈసును వీడితె నిలవని రోగం కాదా
స్వార్ధం ఎపుడూ ఒప్పని తనమేగాదా
పుడమిన మెచ్చిన ధనమే త్యాగం కాదా
మంచిని మించిన దైవము లేదను మాటే
ఇహమున కోరిక వదిలిన హోమం కాదా
ప్రేరణ లేనిదె సాధన నడకే లేదుగా
మధనము జరిగితె మార్గం సోమం కాదా