గజల్8 రచన- విజయ గోలి
యువతకేమొ వేగమందు అదుపన్నది లేదుకదా
భవితచూడ బాటలోన మలుపన్నది లేదుకదా
ఏడడుగుల తడబాటులు లేకుంటే పండుగంట
సరిజోడుగ ప్రేమలుంటె అలుసన్నది లేదుకదా
మంచిచెడులు ఎంచిచూడ మనుషులంత ఒక్కటంటె
మనసులోన తెలుపుతప్ప నలుపన్నది లేదుకదా
అమ్మతనము ఎల్లవేళ కల్పతరువె ప్రేమపంచ
రాయికొట్టిన చెట్టుకెపుడు సలుపన్నది లేదుకదా
కలసివుంటె కలదుసుఖము నానుడెపుడొ ఉన్నదంటె
రామజపమె తపమైతే తలుపన్నది లేదుకదా