నెమలీకే నా చెలియ

aవిజయ గోలి గజల్
జ్ఞాపకాల పుటలలోన నెమలీకే నాచెలియ
అగరుపూల నెత్తావుల సౌగంధికే నాచెలియ

చినుకులలో చిందేసిన చిన్నతనం తానుగా
జేగంటల సవ్వడిలో సుహాసినే  నాచెలియ

వసంతాల వేడుకలో ఇంద్రధనుసు వన్నెలుగ
మల్లెపూల మడుగులలో  సౌవర్ణికే నా చెలియ

తళుకుమనే తారలలో జాబిల్లిగ మెరవగా
కలువపూల రేకులపై నీహారికే నాచెలియ

మనసంతా మందిరమే మనసైన దేవతకు
సరిజోడుగ నాతోడున మాళవికే  నాచెలియ

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language