మల్లినాధ సూరి కళాపీఠం
*బాలకృష్ణుడు*విజయ గోలి
అష్టమి శుభలగ్నమున ..
దేవకి అష్టమగర్భమున
కంసున చెఱశాల యందున
ఆవిర్భవించె నారాయణుడు.. నల్లనయ్యగ
నందునింట జేరె ..ఆనంద కిశోరమై..
యశోదమ్మ ముద్దుల పట్టిగ..
వ్రేపల్లెకే. కనువెలుగాయె యదునందనుడై …
శిఖిన పింఛము తళతళ మెరియగ
దండకడియములు ధగధగ లాడగ
మెడనిండుగ చెంగలువలాడగ
పట్టుదట్టియే పాదములానగ
చిట్టి పాదముల చిరుమువ్వలు…
ఘల్లు ఘల్లుమని సవ్వడిచేయగ
వెదురు వేణువు వేడుక చేయగ..కృష్ణయ్య