శ్వేత హంసలు

మల్లినాధసూరి కళాపీఠంyp

సప్తవర్ణాల సింగిడి

బుధవారం 14/7/2020

అంశం-:దృశ్యకవిత

వైద్యో నారాయణోహరి

నిర్వహణ-:సంధ్యా రెడ్డి గారు

రచన-:విజయ గోలి     గుంటూరు

*శ్వేత హంసలు*

ధన్వంతరి ..అంశతో

అవనికి అరుదెంచిన

హరినారాయణులు

మానవ సేవా సుమాలతో..

మాధవుని అర్చిస్తున్న

మహనీయ మహర్షులు ..వైద్యులు

జీవితాలను పణంగా ..

కరోనాతో ..చదరంగం

ఆడుతున్న..జీవదాతలు..

గుండెనిండ ధైర్యంతో..

కరుడు కట్టిన కాఠిన్యం తో

సహజీవనమే చేస్తూ..

యుధ్దమే చేస్తున్న సిపాయిలు..వైద్యులు..

శ్వేత హంసలై  కరోనాను వడకడుతూ

పరమహంసలైనవైద్యులందరూ..

దేవదేవుని సాన్నిధ్యంలో ..

దివ్యజ్యోతులుగా..వెలగాలని ప్రార్ధిద్దాం

కంటి వెలుగులైన వారి పిల్ల పాపలు

చల్లగా ఉండాలని నిండు మనసుతో దీవిద్దాం..

అహర్నిశం వారు అందించే సేవలకు

తీరని ఋణాన్ని తీర్చే యత్నంగా

సహకరించి..చేయూతనిద్దాము

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language