నవ్వించు

నవ్వు నవ్వించు

నవ్వుతూనే వుండు

చిరునవ్వులు ఎన్ని మిగిలాయో

చిరునామా లేదుగా   విజయ గోల

రాలుతున్న చుక్కలకై ఎదురుచూస్తూ ..

కోరికల చిట్టా తో  నేనుఏది ముఖ్యమో ..

ఎంచి చూసే లోపు చుక్క జారిపోయింది ..

మళ్ళీ చూసేలోపు మబ్బుతెరలు కమ్మేశాయివిజయ గోలి

వూరు పొమ్మంటుంది

కాడురమ్మంటుంది

మనసు  మాత్రం పంచిన..ప్రేమ

కొంచం తిరిగి ఇమ్మంటుంది .. విజయ గోలిఢ

పండుటాకుల పరమపదం చూస్తూ ..

జాలువారుతున్నాయి జ్ఞాపకాల కన్నీళ్లు..

చిరుచిగుళ్లను ..ఆనవాళ్లుగా స్పృశిస్తూ ..విజయ గోలి

వయసు మళ్ళిన బ్రహ్మ రాతలు

ఆడపిల్లల నుదుట..

వంకర గీతలవుతున్నాయి..

అదుపు తప్పిన మృగాళ్లకు వేటలవుతున్నాయి..విజయ గోలి

గుడి మెట్ల మీద  పావురాళ్ళ  పలకరింపులు వింటూ ,

క్షణమొక యుగముగా   నిరీక్షించిన    సమయం ,

నేడు మిగిలి పోయిన ఒక మధుర  జ్ఞాపకం .విజయ గోలి

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language