చిత్ర కవితా మంజరికి ..
నా ఈ మనో భావన…
నీ జ్ఞాపకాల భూపాలం లో మరో ఉదయం …
కాలం కరిగి పోతున్నా గాయం మానకుంది…
క్షితిజం పై మెరిసే కిరణం ..అరక్షణమే ..
ప్రకృతి గీసిన ..విచిత్ర వర్ణ చిత్రం …
నీ సాంగత్యంలో నా గతం అంతే …
నీ జ్ఞాపకాలతో మరో ఉదయం ..
మదిలోతును మభ్య పెడుతూ ..
పెదవుల పై చిరునవ్వును పులుముకుంటూ
నది పై మెరిసే ఉదయపు వెలుగు లాగా ..
బ్రతుకు పోరాటంలో మరో ఉదయం కై
నీ జ్ఞాపకాలతో ఎదురు చూపు…విజయ గోలి