వేకువలో వెన్నెల* విజయ గోలి
ఆశలన్ని ఆకశాన
తారలుగా మెరిసినపుడు
మనసు ..ఉలికిబాటు
ఊసులాడుతుంది..
ఊహలన్ని చీకటిలో
మిణుగురులై ముసురుతుంటె
ఎదలోపలి వెలుగు కడలి
పొంగిపొర్లిపోతుంది
నిర్వేదపు దారులలో …
మరణ వేదన వీగినప్పుడు …
వేకువలో వెన్నెలొచ్చి
స్వాగతాలు పాడుతుంది..
నీలిరంగు మాటు నిధులు
నేలదారి జారినప్పుడు ..
సంబరమే అంబరాన
హరివిల్లుగ విరుస్తుంది
సంశయాల సమరంలో ..
జయమే విహంగమైతే
విజేతగా ఓటములకు ..
వీడుకోలు పలుకుతుంది