విజయ గోలి. గజల్
వినువీధుల విహంగమై విహారమే చేసేను
మేఘాలతొ మెరపులుగా దోబూచులె ఆడేను
సందెపొద్దు బుగ్గలలో సర్దుకుంది సిగ్గులో
సన్నజాజి సరదాలే తెమ్మెరలై సాగేను
పాలపుంత వెలుగులలో పన్నీరుల జలకాలు
పరవశించి ప్రణయాలే పాటలుగా పాడేను
చుక్కపూల తోటలలో తళుకుబెళుకు జిలుగులో
తెలిమబ్బుల తెరలుతీసి నెలవంకపై ఊగేను
నిత్యమైన ఆనందం మదినిండితె విజయమే
గమనమెపుడు గమ్యముతో గుడిగంటగ మ్రోగేను