చెలుల తోడ

విజయ గోలి   గజల్

సఖులతోడ నల్లనయ్య  సరసమాడ పిలిచినాడు
చందనాది గంధాలతొ జలకమాడ  పిలిచినాడు

నవమినాటి వెన్నెలలో నింగినీడ నీలమవగ
జలతారుల జల్లులలో  విందులాడ  పిలిచినాడు

కలువలన్నీ కొలువుదీరి విరపూయగ నవ్వులలో
మధువులూరు అధరాలపై ముచ్చటాడ పిలిచినాడు

పన్నీరుల పరిమళాల పులకరింత పలుకరిస్తే
తడితనువుల తమకాలతో తరియించగ పిలిచినాడు

వేడుకగా చుక్కలన్ని చమ్మచక్క లాడుతుంటె
బృందావన చందమామ బంతులాడ పిలిచినాడు

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language