విజయ గోలి. గజల్
కన్నులలో కార్తీకం వెలుగులాయె కమనీయం
కొలనులోని దీపాలే పువ్వులాయె కమనీయం
సోగకళ్ళ చూపులతో ఆడుకున్న సోయగమే
కన్నయ్యకు కనులబాస కానుకాయె కమనీయం
గోపాలుర సంబరాల సఖియలాడె సరసాలే
సింగారపు రాధమోము సిగ్గులాయె కమనీయం
వెన్నెలంత ప్రోగుచేసి వెలదిబొమ్మ చేసెనేమొ
అందాలతొ గోవిందుని విందులాయె కమనీయం
మనసులోని కోరికలే విన్నవించ *విజయముకై
మాధవుడే చెంతచేర మధువులాయె కమనీయం