
గజల్. విజయ గోలి
గువ్వలెగిరి పోయాక గూడునలిగి పోవునులే
చల్లగాలి తరుముకొస్తె మబ్బుకదిలి పోవునులే
కలకాలం శిశిరమే కమ్ముకోని మురియదులె.
వసంతమే గుండెతడితె వెతలువదిలి పోవునులే
కొత్తనీరు వరవడితో పాతనీరు మరుగుపడును
మరపొక్కటి మందుగానె మనసు నడిచి పోవునులే
వయసెప్పుడు అడ్డురాదు మనసెప్పుడు అదుపైతే
ఆలోచన అందమైతే అహముకదిలి పోవునులే
అభిలాషలు ఆవిరైతే విజయానికి ఆయువేది
తలవకున్న తరులదారి విరులురాలి పోవునులే