గజల్ విజయ గోలి
కనులుమూసి తలచితివా నీకలలో నేనుంటా
మనసుతట్టి పిలచితివా మాటలలో నేనుంటా
చుక్కలలో చిక్కాననీ చింతలలో వేగకెపుడు
గాలిలోని గమకంగా శ్వాశలలో నేనుంటా
గుండెలలో గుడివున్నది దేవేరివి నీవేగా
నీమనసున నిత్యమైన అర్చనలలొ నేనుంటా
చీకటెపుడు నిలిచిపోదు వెలుగుకూడ నేనేగా
వేచిచూడు వ్యధవెంట వేడుకలో నేనుంటా
ఆశలతో అర్ధించకు ఆమనెపుడు దూరములే
తరచిచూడు తామరాకు “విజయాలలో నేనుంటా