గజల్. విజయ గోలి
నడిరేయిన నీపిలుపే పిలిచినదీ పరవశాన
రాసలీల విందులకై వేచినదీ పరవశాన
అలరించే అందియలే అలజడినే చేసేనులె
కుదురులేక కంకణాలు మ్రోగినవీ పరవశాన
చుక్కలన్నీ దారికాచి పక్కుమంటు నవ్వాయిలే
పొంచిపొంచి పొదలమాటు దాగితినీ పరవశాన
జలతారుల పరదాలనే జాబిలమ్మ చాటుచేసె
అడుగడుగున అలజడితో చేరితినీ పరవశాన
ఆపకుమా ఆవేణువు ఆదమరిచె వ్రేపల్లియ
అలుపుతీర నీఎదపై వాలితినీ. పరవశాన