
గజల్ రచన-:విజయ గోలి
మువ్వలసవ్వడి ముంగిటనవ్వుగ మ్రోగెను తానే
వేకువ వెలుగుల మంచుపూవుగా మెరిసెను తానే
అల్లిన తీగలు అల్లరిచేయగ మోమున హాసం
చిటపట చినుకుల వలపులజల్లై కురిసెను తానే
కలువల చెలువపు సొగసులు చూడగ జాబిలి చేరే
చుక్కల చాందిని కప్పుకురమ్మని పిలిచెను తానే
కోయిల పాటల కోమలిమదినే కలిచెను కాముడు
వీనుల విందుగ మురళినాదమై మురిసెను తానే
వేచిన వేళల విభుడేరాగా విరులదె “విజయ ము
తుంటరి తుమ్మెద తోడై రాగా విరిసెను తానే