గజల్ విజయ గోలి
వనమాలీ ప్రియమార పిలిచినదీ రావేలా
మనోహరీ మనసారా తలచినదీ రావేలా
మౌనాలకు మాటలనే నేర్పినదె నీమురళీ
రాధగాను రాగాలను పాడినదీ రావేలా
మువ్వలకు మురిపాలను నేర్పినదె ఆ రవళి
నెమిలాడగ నీవనియే మురిసినదీ రావేలా
అడుగులసడి ఆమనియై ఉల్లమునే ఊపినదే
అలలపైన నీరూపమె ఆడినదీ రావేలా
నీవునేను ఒక్కటనే ధ్యానములో విజయ” ములే
నిన్నంటిన నీలముగా నిలచినదీ రావేలా