తెలి మబ్బుల తేరుపైన

గజల్..రచన విజయ గోలి

తెలిమబ్బుల తేరులపై తెమ్మెరనై ఆడేనా
నెలవంకతొ నీజోడుగ వెన్నెలనై ఆడేనా

తారకలా తళుకులన్నీ తుళ్లిపడే జల్లులుగా
నీలికురుల సౌగంధిక సౌరభమై ఆడేనా

నీడలలో నీశ్వాసలు గుసగుసలై ఊసులాడ
మొయిలునీడ మేనుమరిచి మయూరమై  ఆడేనా

నీలవర్ణ మేఘాలలొ నీలమైన నిన్నుతలచి
జలతారుల తరంగిణిలొ తారకనై ఆడేనా

ఎదఎదనా నీకధలే స్వరఝరిగ సాగుతుంటె
యమునఅలల  ఒదుగుతున్న  “విజయా న్నై ఆడేనా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language