వాహ్యాళి

గజల్. రచన-: విజయ గోలి

నీతోడిదె వ్యాహ్యాళీ వరమెంతో మోహనమే
నాగమల్లి నవ్వులలో నడకెంతో మోహనమే

అడుగులలో అందెలసడి ఎదలయలో సవ్వడులే
సందెపొద్దు సరాగాల   సరసమెంతొ మోహనమే

మల్లెగాలి వేణువుతో మంతనాలు చేస్తోందిలె
రమ్యమైన రవళులతో  రాగమెంతొ మోహనమే

చల్లగాలి నెపముతోడ పూవులన్నీ తాకుతుంటె
మాటలలో మరులుచూపు మదనుడెంతొ మోహనమే

జన్మమంత నీనీడలో *విజయ ములో మెరవాలని
తపముచేసి తరియించే తనువెంతో మోహనమే

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language