గజల్. రచన. విజయ గోలి
మరలివత్తు మాపటేళ మాటలాపి పోనీయవ
చల్లలమ్మ జాగాయెను ఆటలాపి పోనీయవ
దారికాచి దరిచేరుట తగనిదేగ ఈసమయం
సవ్వడదిగొ సఖియలదే తగువులాపి పోనీయవ
కలువలన్నీ సాక్ష్యమే చక్కదనమే నీసొత్తుగ
వ్రేపల్లెలొ వేడుకవుదు మాటలాపి పోనీయవ
చందమామ సైదోడుగ తారలతో తరలివస్తా
మురిపెములా మత్తుజల్లె ముద్దులాపి పోనీయవ
మలయానిల మందసాల మానసమే ఊగుతుంది
పొదరిళ్లన పొందికలో ఊపిరాగి పోనీయవ