4గజల్ విజయ గోలి
మౌనరాగం మాటునున్న పలుకులన్ని తెలిసెనులే
అలకమాటు అలవికాని కులుకులన్ని తెలిసెనులే
ఎరుపుకన్ను చూపులోన ప్రేమకత్తి వాడివుంది
మరుగుతున్న మంచుపూల చిలుకులన్ని తెలిసెనులే
అలకనటన చెప్పుచున్న చెక్కిలిపై నొక్కులెన్నో
పంటనొక్కె పెదవిపైన తళుకులన్ని తెలిసెనులే
నీలికురుల విసురులోనె దరికిపిలిచె జాడవుంది
జాజిపూల జాణతనపు ఉలుకులన్ని తెలిసెనులే
వలపునటన చాలుచాలు పంతమాపి చెంతచేరవె
దోరనవ్వు దొంగాటల దుడుకులన్ని తెలిసెనులే