ఆహ్వానం

గజల్.     రచన -:విజయ గోలి

చిగురాకుల చిలకమ్మే పలుకుననీ అనుకున్నాన
విరిపూవుల మధువంతా ఒలుకుననీ అనుకున్నాన

గాలులలో చందనమే జతకూడా ఉన్నదిలే
ఊహించని వేడుకలే పిలుపులనీ అనుకున్నాన

కోయిలమ్మ పాటలలో కోరికలే ఉన్నవిలే..
వేణువులో  పల్లవించు తలపులనీ అనుకున్నాన

మయూరాల నాట్యములొ జతిలయలే కలిసెనులే
సొగసులలో కుసుమించే వలపులనీ అనుకున్నాన

కలగననీ ఆహ్వానం కనులముందు కదిలిందిలె
మోహనుడే  మురిపముగా నిలుచుననీ అనుకున్నాన

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language