* గజల్. విజయ గోలి
కనురెప్పల కుంచెలతో వర్ణలేఖ వ్రాస్తున్నా
ప్రణయాలే పల్లవిస్తు ప్రేమలేఖ వ్రాస్తున్నా
మధుపాలే మబ్బులుగా ముసిరినవే మధువుకోరి
స్వగతాలే సమ్మతంగ హంసలేఖ వ్రాస్తున్నా
చిగురించే అల్లికలో జారిపోవు తీగలేల
వమ్ముకాని నమ్మకాల హస్తరేఖ వ్రాస్తున్నా
కలతలేక కాలమంత కలిసిజతగ సాగాలని
అధరాలపై హసితంగా చంద్రలేఖ వ్రాస్తున్నా
సమ్మోహిత రాగాలలో విజయాన్నే కాంక్షిస్తూ
సురలోకపు బంధాలతో శుభలేఖ వ్రాస్తున్నా.