మంచితనం మాట కొస్తే

గజల్…విజయ గోలి

మంచితనం మాటకొస్తే ఎక్కడనీ అంటావా
మనసంతా మాయలతో  మసలెననీ అంటావా

గుండెలలో కోవెలొకటి నీకోసమె నిలిపానుగ
వేలుపుగా కొలువుండగ కుదరదనీ అంటావా

ప్రేమఎంత మధురమో తెలియలేదు ఇన్నాళ్ళు
మధ్యనున్న మబ్బుతెరలు వీడదనీ అంటావా

ఉదయాలలో అస్తమయం చూస్తున్నా ప్రతిరోజు
మోముపైన సింధూరం నవ్వెననీ అంటావా

గోవిందుని గోములలో  విజయమేగ అలకలలో
ప్రేమంతా మాటలలో పలుకదనీ అంటావా.

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language