గజల్ విజయ గోలి.
కష్టమెపుడు చెప్పిరాదు ఇష్టమెపుడు వదిలిపోదు
గుండెదిటవు చేసిచూడు ఆశెపుడూ వదిలిపోదు
నమ్మకమే నాణ్యమవును నాటకాలు నలుపురంగు
నవ్వునెపుడు నమ్ముకుంటె స్నేహమెపుడు వదిలిపోదు
అలుపుసొలుపు ఆదమరుపు లేనివేగా సాగరాలు
ఆగదనీ కసురుకుంటె అలసటెపుడు వదిలిపోదు
వలసవచ్చు పక్షులనూ వరసనిలిపి స్వాగతించు
బావినుండి బయటకొస్తే గెలుపెపుడు వదిలిపోదు
చిత్తమెపుడు విచిత్రములె చిందులేసె పోకడలే
కళ్ళెమేసి కదమాపితె “విజయ”మెపుడు వదిలిపోదు