శీర్షిక-:భుజం…
రచన-:విజయ గోలి
నీ మొట్ట మొదటి రోదనకు
నీ చిరునవ్వుల జల్లులకు
నీవాడిన తొలి పలుకుకు
అమ్మ స్పందనే ప్రోత్సాహం..
తప్పటడుగు తరుణంలో ..
వ్రేలుపట్టి నడక తోడుగ
నడత నేర్పిన నాడు
నాన్న నీడే ప్రోత్సాహం
అక్షరాలు దిద్దు రోజు
చేయిపట్టి ముద్దుగా
చదువు విలువ నేర్పిన
గురువులదే ప్రోత్సాహం
అడుగడుగున నీ బాటలో
ఆసరాగ అందించిన చేతులెన్నో
విజ్ఞతతో విచారించి..అందించు.
.అందని ..కొందరికైన …నీ ప్రోత్సాహం
జీవితాన ఉన్నతంగ ఎదగాలంటే…
వెన్నుతట్టి బుజ్జగించి…. భుజమిచ్చే
మనసొకటి ప్రతి మనిషికి తోడుంటే
అంబరమే అవలీలగ అందుకదా…