బడుగు బ్రతుకులు

*బడుగు బ్రతుకులు * విజయ గోలి

పొట్టకూటికై పొరుగుదేశం వలసపోతే ..
కూలినాలి చేసుకుంటూ పిల్లాజెల్లతో బ్రతుకుతుంటే
అదుపు తప్పిన మాయదారి అంటురోగం
అయినకాడికి మంది బతుకులు మంటపెడుతుంటే …
నిట్టనిలువుగ..ఉన్నపాటున ..వెళ్లిపొమ్మంటే …
ఆగమైన బ్రతుకుకు …దిక్కులేని చావుకంటే ..
పుట్టినూరు మట్టి మేలని మూట ముల్లె నెత్తినెట్టుకు..
గుండె రాయి చేసుకొని..ఎండ వెన్నెల ఒకటిగానే …
వూళ్లకూళ్లు దాటుకుంటూ వట్టి నడకన ..
బాట పట్టిన బడుగు బ్రతుకులు గమ్యమెప్పుడు చేరునో ..

 

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language