ఆధిపత్యమా ..నీ అర్హతేమిటి …
తాతలు తాగిన నేతులా…వారసత్వపు నీతులా ..విజయ గోలి.
వడగాల్పుల కాలం వేడికి
వడిలి రాలుతున్న జ్ఞాపకాలు..విజయ గోలి
రంగులలో కన్న కలలు..
రెప్పల మాటున జారుతూ ..
రంగువెలిసి పోతున్నాయి ..
నలుపు తెలుపుల నాణ్యం తెలియక ..విజయ గోలి
అడుగడుగున లక్ష్మణరేఖలు …
అవి దాటితే తప్పని అగ్నిపరీక్షలు
రాజ్యాలేలినా..రాళ్లుకొట్టినా..
తప్పని అతివ అంతరంగమధనం ..విజయ గోలి .
చిట్టిచేతిని పట్టుకొని అడుగునేర్పుచు ..
నీ బ్రతుకుబాటకు దివ్వె ఐన నాన్నకు ..
పట్టుదప్పిన వయసులో అడుగు తడబడు వేళ..
నీ గట్టిచెయ్యే నాన్నచేతికి ఊతకర్ర..రా ..చిన్నా….విజయ గోలి
చీకటిలో చిరుదీపమే పెను వెలుగు
నిశీధి నిండిన మిణుగురులు
మదినిండిన ఆశల సంకేతాలు
విముక్తులైన చిరువెలుగులు..
నింగిపైన తారకలు గా నిత్యమై నిలవాలి ..విజయ గోలి
బాల్యంలో ఆడుకున్న బొమ్మ …కంటపడగానే ..
వెంటనే మనసు జ్ఞాపకాల గది తెరిచింది
అరవైలో ..ఆరు అల్లరిగా తొంగి చూసింది ..
ఆదమరిచి ..తనివి తీరా నవ్వు కోవాలనుకున్నా
పంచుకునేందుకు ఎవరినీ ఎంచుకోలేదని ..
అపుడే గుర్తొచ్చింది …నేను ఒంటరినని ..విజయ గోలి
కలలు బాగున్నాయని కాలమంతా కనులు మూసినిదురోకు
కాలచక్రం నీపై కదంతొక్కుతూ కదలిపోతది ..
కల కరిగి మెలుకువొస్తే కనుల ముందు మిగిలేది ..
కాలం చెప్పిన న్యాయం రంగు మారిన మైదానం …విజయ గోలి