అక్షరాల రంగవల్లులు

అక్షరాలతో  అందంగా రంగవల్లులేయాలని ..

అంతులేని..ఆరాటం ..స్పందనలను చుక్కలుగా ..

పెల్లుబికే..భావాలతో .పెనవేస్తూ  కలపాలని

            విజయ గోలి.

తరిగిపోతున్న.. జాతి ..తరాల సంపదలో ..

తరగనీకు ..అనుబంధాల ..పెన్నిధిని ..

                   విజయ గోలి .

వెలుగు నీ వెనుకున్నపుడు నీడ నీ ముందుంటుంది ..

వెలుగు నీ ముందున్నపుడు నీడ నీ వెనుకుంటుంది ..

ముందో వెనుకో తోడుగ ఉందని నీడనెపుడు నమ్మకు ..

నిశీధిలో నువ్వున్నప్పుడు నీ నీడ జాడే ఉండదు ..విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language