అవనికి అతిధి

అవనికి అతిధిగా మాత్రమే వచ్చావు …
అత్యాశతో. ..అంతా..నాదేనంటున్నావు ..
తరాల కోసం తపన పడుతున్నావు ..
ఎన్ని తరాలైనా…అంతరించక ..తప్పదని …
చెప్పకనే చెపుతున్న చరిత్ర చూడు…. విజయ గోలి

అరువు తెచ్చుకున్న అడవి చట్టం
తెలుపు రంగుకు నలుపు నదిమి,
ఎరుపు పులుముతోంది విశ్వమంతా ..

తెల్లని పావురం రంగు మారక ఎగిరే చోటెక్కడ ?
కసాయి తనానికి కాషాయం అంటితే ఎంత బాగుణ్ణు …

హరివిల్లు రంగులన్నీ అందంగా విరిసే రోజుందా ?
రేపన్నది ఆశైతే ,ఆ ఆశకు అంతుందా ..విజయగోలి

జాజులు మల్లెలు ,విరజాజులు
మరువాలు,దవనాలు జతచేస్తూ …
అల్లుకున్న మాలల పరిమళాలలో..
ముసురుతున్న నీ తలపుల తుమ్మెదలు ..విజయ గోలి

సరిహద్దున నీవే
సాహసమే ఊపిరిగా
కంచెవై దేశానికి కాపుకాస్తూ
నీ త్యాగానికి మా సన్మానం
అశ్రువులతో మేమిచ్చే
ఎద నిండిన మా జోహారులే ..🙏🏻🙏🏻🙏🏻
జై జైజవాన్ ..జైజవాన్ ..జైజవాన్ 🙏🏻🙏🏻🙏🏻విజయ గోలి

ఎన్నికల హరివిల్లు
ఓటరు పై వరాలజల్లు
నెగ్గిన తరువాయి నిధుల నిల్లు
కోతికొమ్మచ్చి లో ఆటకి తూచ్ ..
ఓటరు అయ్యేను ఆటలో అరటి పండు ..😭😭

మిత్రులకు శుభోదయం 🙏🙏

తదియ వెన్నెల చూసి ..
తెల్లవారిందనుకుందేమో ..
తొలి ఝాములోనే తొందరపడుతూ ..
స్వరం సరిచేసుకుంటోంది …
శుభోదయ రాగాలు పాడేందుకు…

అంతరాష్ట్రీయ బాలికా దినం….

పిండం నుండే మొదలైన వివక్షలు ..

వయసుతో పెరుగుతున్న ఆంక్షలు ..

రాళ్లు కొట్టినా ..రాజ్యాలేలినా ..

అంతరిక్షయానాలు చేసినా ..

అడుగడుగున తప్పని లక్ష్మణ రేఖలు..

క్షణం క్షణం జరుగుతున్న లైంగిక దాడులు ..

ప్రతి క్షణం చచ్చి బ్రతుకుతున్న …

ముక్కు పచ్చలారని ముద్దు పాపలు..

సంబరాలు చేద్దామా …సంతాపం చెపుదామా …విజయ గోలి

మిత్రులకు శుభోదయం 🙏🙏

మంచు ముత్యాలు రాల్చుకుంటూ …
నిశి నిశ్శబ్దంగా మరలి పోయింది ..!
రాలిన ముత్యాలను బంగారు తీగల్లో పేరుస్తూ ..
ప్రకృతి పదమంజీర నాదాలతో .. వేకువ ..వెలుగై ఏతెంచింది ..!
విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language