మల్లినాధ సూరి కళా పీఠం
మాధవేశ్వరీ దేవి ప్రయాగ విజయ గోలి
పవిత్ర ప్రయాగ తీర్ధ రాజము
త్రివేణి సంగమ సంయుక్తము
పావన గంగా యమునల జత
అంతర్వాహినియై అమ్మ
సరస్వతి అలరించు చోట
మాఘస్నానము మహిమాన్వితము
సరిగంగ స్నానాలు సంగమాన
సతి కరాంగుళములు
రాలి ఒదిగిన చోట
చతుర్దశ శక్తి పీఠమై
చతురస్ర పీఠమే మూలరూపిగ
మాత మాధవేశ్వరిగ మహిమ చూపు
పీఠాన అలరించు
ఊయలే అమ్మ ఒడిగా
భక్త జనులకు ముక్తినిచ్చు
ఆదివాసుల ఆరాధ్యమై
అలోపి దేవిగ ఆదరించి
ఆడపడుచుల కాచు తల్లి
అమృతాభిషేకము చేసి
బృహస్పతి బిందుమాధవిగ
అమ్మని పూజించి పునీతుడయ్యె
భాస్కరుడు అర్చించి భాస్కర క్షేత్రమయ్యె
త్రిశక్తి లలితా దేవి .నవదుర్గల తోడ
భక్త జనుల బ్రోచు భువనేశ్వరీ మాత
క్షీర సాగర మధన మందున
అమృతమే ఉద్భవించగ
భద్రపరచగ గరుత్మంతుడు
అమృతభాండము నెత్తగ
ప్రయాగ నాసిక్. హరిద్వార్
ఉజ్జయని నగరాల చింది పడగ
అమృత తీర్ధాలుగ అవతరించి
పితృదేవతల శ్రాద్ద కర్మల ప్రఖ్యాతి
పాపకర్మల పరిహరించు ప్రయాగ
పుణ్యమిచ్చెడి తీర్ధ రాజము