గిరిజా దేవి కార్తీకం

శ్రీ మల్లినాధ సూరి  కళాపీఠము  ఏడుపాయల

శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యము

సప్తవర్ణాల సింగిడి 3/12/20

అంశంకార్తీక మహోత్సవములు ..ఓఢ్యాయాం గిరిజా దేవి

నిర్వహణ-: పురాణ కవులు శ్రీ  బి  వెంకట్ కవి గారు

శ్రీ బాబు రావు గారు.శ్రీమతి సమత గారు

రచన -:విజయ గోలి

ప్రక్రియ -: వచనం

అష్టాదశ పీఠాలలో 

ఏకాదశ పీఠం ..ఓఢ్యాయాం గిరిజాదేవి

జాజ్పూర్ రాజాస్థాన పరిసరాలలో 

ఓఢ్యాణా గ్రామంలో వైతరణీ నదీ తీరములో 

సతీదేవి నాభి భాగము శక్తి పీఠమై ఆదిశక్తి

గిరిజాదేవి రూపమై ఓఢ్యాణ పీఠనిలయగా

బిందుమండల వాసినిగ మహిమాన్వితము

మహిషాసుర మర్ధని గా ద్విభుజములతో

ఒకచేత మహిషుని వాలము పట్టి 

వామపాదమున మహిషుని తొక్కుతూ మరొక చేత 

త్రిశూలముతో రాక్షసుని పొడుస్తున్న మూలరూపము

బ్రహ్మ క్షేత్ర పాలకుడై అమ్మను అర్చించు నిత్యము

విధాత కోరిక మేర పార్వతీ దేవి త్రిశక్తి రూపమై

విరజాదేవిగా భక్తులపాలిటి భగవతి సాక్షాత్కారము

నవదుర్గల సమూహముతో ఓఢ్యాణ పురవాసిని

సర్వదేవతలు నిత్యము పూజించు వరదాయని

వైతరణీ వెలసిన ఆదివరాహ రూపిగ విష్ణువు

పరమ పూజ్యమువైతరణీ నది స్నానము 

సర్వ పాపహరము ..పుణ్య వితరణము

శ్రాద్ధకర్మల పితృదేవతల మోక్ష ప్రదము..

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language