మల్లినాధసూరి కళాపీఠం
సప్తవర్ణముల సంగిడి
అంశం-:బోనాలు. 11/07/2020
నిర్వహణ-:శ్రీ బి వెంకటకవి గారు
రచన-: విజయ గోలి..
ప్రక్రియ-:వచన కవిత
అమ్మా ..బయలెల్లినారో…
అమ్మతల్లీ ..బయలెల్లి నారో..
అంటూ..ఆషాఢమాసాన..
ఆహ్వానమే..పలికేరు…అమ్మోరికి
ఘటము శిరమున పెట్టి
గణరాజు ..కదలగా..
కొరడాలు ఝళిపిస్తూ
కొమ్ముబూరాలూదుతూ..
కొలుపులే ..చేసేరు..
కుండ మీద కుండ పెట్టి
కుండ చుట్టూ వేప కట్టి
కుండలోన నైవేద్యమెట్టి
కుండ పైన దీపమెట్టి..
చీడ పీడలు ..బాపమంటూ
చిన్న పెద్దల ..కాచమంటూ
పంట పశువుల బ్రోచమంటూ
ఆడపడుచులు సంబరంగా
అమ్మతల్లికి..బోనమెత్తేరు
రంగమందున మాతంగి..
ఘటమెక్కి.. భవిత చెప్పేను…
మైసమ్మవై ..మరిడమ్మవై..
మాంకాళివై ..మంచి మాటలు
పలికి మమ్ము కాపాడమంటూ..
మరి మరీ వేడేరు..మనసుదీరగ.