శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడు పాయల
సప్తవర్ణాలంగిడి 25/8/2020
అంశం-;దృశ్య కవిత నరుడా కూల్చకురా
నిర్వహణ-:శ్రీ మతి సంధ్యారెడ్డి గారు
రచన-:విజయ గోలి
ప్రక్రియ -:వచన కవిత
శీర్షిక-: చెట్లు నరికితే క్షామం..
చెట్లు పెంచితే క్షేమం
కుప్ప కూలిన మిత్రమా…
క్షమించు పత్ర హరితమా..
వృక్షోః రక్షతిఃరక్షితః
అంటూనే హరితానికి.
చిరునామా చెరిపేస్తున్నాము..
అభివృద్ధి పేరిట..అడవి తల్లి
ఆనవాళ్ళు కొల్లగొడుతున్నాము
నీ సహజతనే చదును చేస్తున్నాం
ధరణి తరువు తరుణి(అమ్మ)
మీ సహనాన్ని సవాలు చేస్తున్నాము..
పంచభూతాలకు వెలకట్టారు
పశు పక్షిజాతులచిరునామా
ఛిద్రమవుతుంది ..క్షమించు
కాలుష్యపు డ్రాగన్ కాటుకు
ఓజోను రంధ్రాలతో..అతినీలం స్రవిస్తుంది
తరులు గిరులు కానరాక
వరుణుడు స్థితిగతులే మార్చాడు
తడిఆరిన అడవులపై..
కార్చిచ్చులు కక్ష తీర్చుకుంటున్నాయి
కాలుష్యపు కబళింపు
జీవజాతి మనుగడనే శాసిస్తుంది
ఇకనైన కళ్ళు తెరిచి
వృక్షాలను రక్షించకుంటే..
భావితరం బ్రతుకు
రేషన్లో(కృతిమ)ఆక్సిజన్ ..
వరుసలలో అంతమవక తప్పదు..
చెట్లు నరికితే క్షామం..చెట్లు పెంచితే క్షేమం