వరలక్ష్మీ వ్రతం

శ్రీ వరలక్ష్మీ. విజయ గోలి

స్వాగతమమ్మా వరమహాలక్ష్మి
స్వాగతమమ్మా శ్రీ మహాలక్ష్మి ..
పసిడి పాదముల ..కనక మంజీరములు
నిండుగ మ్రోగగ ..నడిచి రమ్ము మా ఇంటికి..
స్థిరముగ నుండగ ..శ్తుతి నే చేసెద..శ్రీకరీ..🙏🏻🙏🏻

శ్రీ హరి రాణివి..సింధుపాణివి
అష్టలక్ష్మివై మము ఆదరించవే..
సకల సంపదల సంరక్షించవే..
కరుణామృతమును కనులనింపి.
కాపాడవె మము కాత్యాయనీ🙏🏻

పసుపు కుంకుమల ..పచ్చని పువ్వుల..
పరి రక్షించవే..పరమ పావని
సద్భావన నింపవే భార్గవిగా..
సదా మా తలపున నిలిచి….
సాంత్వననిమ్మా ..ప్రియ బాంధవిగా..🙏🏻

నిషికవు ….నిత్య దరహాసినివి..
సాగర పుత్రివి …శశి సోదరివి..
వేడిన వరముల ..వేడుక తీరగ
దీవనలిమ్మా . ..అష్టైశ్వర్యముల ..
ఆశీర్వాదించుమా.. అమలోద్భవిగా..🙏🏻🙏🏻

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language