నిజమైన ఆనందం

సప్తవర్ణముల సింగిడి
మల్లినాధసూరి కళాపీఠం
ఏడుపాయల
బుధవారం 8/7/2020
అంశం-:నిజమైన ఆనందం
నిర్వహణ-:వెలిదె ప్రసాద శర్మ గారు
ప్రక్రియ-:వచన కవిత
రచన-:విజయ గోలి. గుంటూరు

కసుల లోన కదలాడిన ..
అపరాజిత కలలన్నీ..
అందలాలు ఎక్కినపుడే
అందరికీ ఆనందం..

ఏడడుగుల నడకలో
తడబాటులు లేకుంటే
గంగ ఓలె నిండుగ
సాగిపోతె ఆనందం

మనిషికొక్క తీరుగా
మనసు నుండు..ఆనందం
తెలుసుకుని నడుచుకుంటె
మనుగడంత ఆనందం

సానుకూల తత్వమే
సహజీవనమైతే…
సుమగంధపు పరిమళాల
వెల్లివిరియు ఆనందం

ఇహము లోన అహము..
మరిచి..అడుగులేస్తే
మది నిండుగ మాధవుని
నింపుకుంటే ..జీవనమే ..
ఆనందపు కైవల్యం.. ..

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language