శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి. 21/8/2020
అంశం-:ఐచ్ఛిక కవిత
నిర్వహణ-:శ్రీ తుమ్మా జనార్ధన్ గారు
రచన-:విజయ గోలి గుంటూరు
శీర్షిక-:*గరిక పూవుదే ఘనమైన స్వేచ్ఛ *
ప్రకృతిలో ప్రతి అణువున..
స్వేచ్ఛ గీతం ఆలాపనే..
పరిధి..లోనె పయనిస్తూ..
పసిడి మార్గమే చూపిస్తూ
హిమ పర్వతాల స్వేచ్ఛనెవరు
ఆపగలరు ..అవనిలో..
పరిమితులే లేక పాతుకున్న ..
ఊడలతో పెరిగిన వటవృక్షమే..స్వేచ్ఛ
ఉన్నత విలువలే దీర్ఘాయువు.. పరిధి
ఉషోదయపు కిరణాలలో
మంచు తడిచిన ముత్యమై..
మెరయు గరికపూవుదె
ఘనమైన స్వేచ్ఛ..నిగూఢత
అల్పాయువు ..అదే పరిధి
పరుగులెత్తు సెలయేరుల..
పరిధి నెవరు గీయగలరు
ఏరు తాకిన నేల పరిధి..
అదే అధిగమించని ..స్వేచ్ఛ
ఆకాశమే నాదంటూ
అందలాల విహరించే
విహంగాల రెక్కలదే స్వేచ్ఛ ..
ఆకాశమే…పక్షి పరిధి
స్వేచ్ఛంటే ..విశృంఖల
విజృంభణ కాదు..
స్వార్ధాలతో జత కాదు
పన్నీటి పరిమళాలు వెదజల్లే
అపరమితమైన సృష్టి లో
పరిమితుల స్వయం ప్రకాశమే …స్వేచ్ఛ…