శ్రీ మల్లినాధ సూరి కళాపీఠము ఆంధ్రప్రదేశ్
శ్రీ అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం
సప్తవర్ణముల సింగిడి 28/12/2020
అంశం-: కవన సకినం
నిర్వహణ-: శ్రీమతి గీతాశ్రీగారు
రచన-: విజయ గోలి
గతమెంత దయనీయము చీడపీడలతో
గతమెంత శోచనీయము వెతలరాతలతో
కదలలేని గతము కాలసర్పము కాటుతో
కాలునినీడలో కరుగుతుంది కాలమెంతో
అన్నమే నోచని అన్నదాత గత గతులు
నడకలతో గతమంతా వలసల వెతలు
దరిచేరని బ్రతుకుతో దారుణమే గతము
భయమెంతో తలచగా భావిలోన గతము