శ్రీ మల్లినాధసూరి కళాపీఠము. ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణముల సింగిడి. 18/12/2020
అంశం-: ఏడుపాయల వనదుర్గా క్షేత్రం
నిర్వహణ-: శ్రీ అమరకుల దృశ్యకవి గారు
శ్రీమతి హరిరమణగారు శ్రీమతి గాయత్రి గారు
శ్రీమతి విజయలక్ష్మి గారు
రచన -:విజయ గోలి
ప్రక్రియ -: వచనకవిత
ముగ్గురమ్మల మూలపుటమ్మగా
మంజీర కెరటాలు పాదాలు కడుగగా
నాగసానిపల్లి నడుమ కోనలలోన
ఏడుపాయల దుర్గమ్మ వెలసేను
వనదుర్గమాతగా జనమేలు తల్లి
జయము కోరి జాతరలు చేసేరు
కొలుపులే చేశేరు కోమలాంగులు కూడి
కోరిన కోరికలు తీర్చగా కోరి కొలిచేరు దుర్గమ్మను
జనమేజయుని సర్పయాగమున
సప్తమహర్షులు సప్తగుండముల
అశువులు బాసిన సర్పజాతిని
వైనతేయుడు ఏడుగుండాల
ఏడుపాయలుగా గంగమ్మను పారించి
సద్గతులు గలిపించె సన్నుతించగ
గరుడుడి పేరుగా గరుడగంగై భాసిల్లె
యాగమాగిన పాపమే బాపగా
ముంజేటి కంకణం గంగనిడగా
బంగారు మంజీరయై ప్రవహించె
కలలోన కనిపించి కాశినాధునకు
ఉద్దరించగ కోర పదహారు కలశాల
కాశిగంగను తెచ్చి యంత్రఫలకము వేసేను
అమ్మ మహిమలు అద్భుతాలై నిలువ
కాచేను ఆతల్లి కల్పవల్లిగ కామితములే తీర్చి
మదినిండ కోరేము వనదుర్గవై వరములీయగ🙏🏻🙏🏻🙏🏻