శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఆంధ్రప్రదేశ్
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 10/12/2020
అంశం-కార్తీక మహోత్సవం గయా సర్వ మాంగళ్య గౌరిక
నిర్వహణ-: కవి వర్యులు శ్రీ వెంకట కవిగారు
శ్రీమతి అంజలి గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ -: వచన కవిత
సర్వ మంగళ మాంగల్యే శివే. సర్వార్ధ సాధకే శరణ్యే!
త్రయంబికే గౌరీ ! నారాయణి నమోస్తుతే!
సర్వ జీవాధారమైన
సతీదేవి స్ధనభాగం
సర్వ మాంగళ్య గౌరిక
సర్వాభీష్ట దాయనిగా
శక్తి పీఠమై మహిమాన్వితము
ఆదివిష్ణువు అనుంగు చెల్లి
సౌభాగ్య ప్రదాయినిగ
మహిలోన మహిళలకు
ఆరాధ్యమే సర్వ మంగళ గౌరి
ఫాల్గుణీ నది తీరాన
రమణీయ గిరుల నడుమ
ప్రకృతి అందాల అలరారె
పరమ పావన గయ
గయుని ఉధ్దరించి
దయతోడ ధర్మశిలన
విష్ణుపాదము మోపె
విశిష్ఠమయ్యె విష్ణుగయ
బోధి వృక్షము నీడ
ఆత్మజ్ఞానము పొంది
సిద్ధార్థుడు బుద్ధుడయ్యె
భువిని నిలిచెను బుద్ధగయ
గయను విడిచిన శ్రాద్ధము
పితృదేవతల పూజ్యమై
సర్వదేవతల అభీష్టమై
కర్మ ఫలమున కైవల్యము