అన్నవరం సత్యనారాయణ స్వామి

శ్రీమల్లినాధ సూరి కళాపీఠము ఆంధ్ర ప్రదేశ్
శ్రీఅమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 28/11/20
అంశం-: కార్తీక మహోత్సవము. శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి
నిర్వహణ-:కవి వర్యులు శ్రీ బి వెంకట్ కవి గారు
శ్రీమతి అంజలి ఇండ్లూరి గారు శ్రీ గిరీష్ పొట్నూరి గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ -: వచన కవిత

రత్నగిరి శిఖరాన రమ్యముగ
శంఖచక్ర ధరుడు శ్రీమహావిష్ణువు
శ్రీ వీర వెంకట సత్యనారాయుణుడై
రమణి రమాదేవి సహితముగ
త్రిమూర్తి స్వరూపమున
పూజలందేను పుణ్యమిచ్చేను

పంచాయతమున పరమ పావనమై
రామయ్య  ,వనదుర్గ వంక నుండగ
పంప వంపుల లోన ,ప్రకృతి అందాల
అలరించు ఆ స్వామి ఆలయమే
ఇల వైకుంఠ వైభోగమే

కొంగుముడుల క్రొత్త జంటల
కోరి కొలిచేవారి కోరికలు ఈడేర
మహిలోన మహిమగల
సర్వోన్నతము స్వామి వ్రతము
సర్వపాపహరము ..
సర్వైశ్వర్య ప్రదము..

అన్నవరము నందు
ప్రసాదాన్నమే వరముగ
ఆదుకొను చున్నాడు
అడిగిన వరముల అందించు సత్యనారాయణుగ
ఇలలోన వెలిసిన శ్రీమన్నారాయణుడు🙏🏻🙏🏻🙏🏻

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language