రచన -: విజయ గోలి
ప్రక్రియ -:వచన కవిత
శీర్షిక-: సత్యభామ
అష్టసతులలో ఇష్ట సఖి
శౌరి హృదయ సామ్రాజ్ఞి
స్వాభిమానపు సౌందర్య గని
నడకలలో సొగసుల ఠీవి
సత్యభామగా సాధ్వి విదితం
కొంటెకృష్ణుని కొంగు కట్టిన కోమలాంగి
భామగా గోవిందుని ప్రేమ గ్రంధం
మదనగోపాలునికై మదనుడే సృజించిన
సమ్మోహన విరిశరముల పొది
పరమపూజ్యుని పాదక్రాంతునిగా
చేసుకుని స్వాధీన పతికయై
కొలువు తీరిన ప్రబంధ కావ్య నాయిక
జాణతనమున నెరజాణగా నిలిచినది
అందమేలేటి అతివకు అహము అలకలు
అలంకారమై అలరారు వలపుల
అభివర్ణంచ సత్యతో సాటి అందాలె లేవు
గీతకర్తకు గీతగీసి నిలిపివేసిన నీలవేణి
నరకాసురునే వధియించి వీరవనితగ వినుతి
దీపావళి దివ్యకాంతుల తేజరిల్లిన దివ్య వనిత
సబల తలవగ సాధించలేని సమరమేలేదు.
మహిని మహిళల కొక రూపు ఇచ్చిన సత్యభామ