శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 10/11/2020
అంశం-:దృశ్యకవిత. ఆత్మ విశ్వాసం తోడైతే
నిర్వహణ-:శ్రీమతి సంధ్యారెడ్డి గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ -: వచన కవిత
శీర్షిక-: ఎవరెస్ట్
విశ్వాసం శ్వాసించే ఊపరైతే
చైతన్యం ప్రకాశాన చరిస్తుంది
సంకల్పమే సమారంభమైతే
ఏకలవ్యుడే ఏకైక ఆదర్శం
పక్షికి కూడా లక్ష్యముంది
ఆకాశము హద్దు ఉంది
ఎదురునిలిచి ఎగిసిపడే
అలవుంది కడలిలో
పడి లేచే పాఠముంది
తలవంచకు తడబడికూడా..
అణువణువున ఆత్మవిశ్వాసం
నిండివుంటే అడుగులోన
అసాధ్యమన్నది అసలే లేదు
ఎదుటివాని ఎదుగుదలకు
ఈర్ష్యపడకు ఈశ్వరుడే మెచ్చడు
ఎక్కుపెట్టిన బాణం నీవైతే
ఎవరెస్ట్ శిఖరమే నీ విజయం