రెక్కలొచ్చిన పక్షి

శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం. ఆంధ్ర ప్రదేశ్
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 4/11/2020
అంశం-:తాత్వికత    రెక్కలొచ్చిన పక్షి
నిర్వహణ-:   శ్రీ వెలిదె  ప్రసాద శర్మ గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ -: వచనకవిత

రెక్కలొచ్చిన పక్షి
రెక్కబలంతెలియకనే
రెక్కలు విప్పార్చుకు
ఎగరాలనే వెర్రి కోరిక
కొత్త రెక్కలు కదా…
విశాలంగా విస్తరించాలనే ఆశ

గూటిగుమ్మం దాటినాకే
గమ్యమేమిటని ప్రశ్న
కనిపించినంత వరకు
కమనీయ బృందావనమే..
మాయ తెలియని మోహం ..

గుండె నింపుకు గుట్టుగా
పెంచిన ప్రేమలు ..
వెలితిగా వెగటౌతాయి
కొత్తప్రేమల కోరికలలో..
స్వార్థం చట్రంలో సృష్టి .. .కాలచక్రం

బంధాల విలువలతో
అనుబంధాల సంకలనం
మనోగవాక్షంలో అనుభవాల
రెక్కలు అలసిన పక్షి
మాయా మోహాలకు సాక్షి

జీవనదశ దిశదిశలో
రెక్కలు అలరార్చే ఆనందం
దేవుడిచ్చిన వరము..
మనిషిజాతికి మాత్రమే
మమత పంచే యోగం

ప్రకృతియే పరమగురువు
సృష్టి చేసిన నిర్దేశం
అనుసరిస్తే అడుగడుగున
ఆనందం ..మానవాళి
మనుగడలో సరళం

అంతర్గత దర్శనం అనంతరం
వచ్చినదారిన విప్పార్చిన రెక్కల
సిసలైన గమ్యం..విశాల
విశ్వపు వినూత్న లోకం
పరమపదపు పావన శిఖరం.

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language