శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవిగారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 2/11/2020
అంశం-:కవన సకినం
నిర్వహణ -:శ్రీమతి గీతాశ్రీ గారు
రచన-:విజయ గోలి
కవిమనసును కాంచగ కమనీయం
రవిచూడలేని అందాలే రమణీయం
భావనలో భవితలెంత బహురమ్యం
తేనెలూరుభాషల తెనిగించు కావ్యం
నిత్యమైనిలిచిపోవు నిర్మల రూపం
చైతన్యపుకాంతులతొ తేజరిల్లు దీపం
కలముతో కత్తినూరు విప్లవ శంఖం
వాగ్దేవిచేతిలో అక్షరమాల రూపం