వాగ్దేవి * విజయ గోలి
ఓంకార స్వరూపిణీ..శ్వేతాంబర ధారిణి. ..
హంసవాహనా శారదా.. అక్షరమాలాధారిణి
శరదేందు మందహాసినీ..వాణీ
చైతన్య చిద్రూపిణీ ..గీర్వాణీ
శరణంటు వేడేను శార్వాణీ..
విధాత తలపున వలపుల రాణి
వరమీయగ వేడెద వీణాపాణి
నా మనమున కొలువై స్ధిరమున భారతిగ
నా వాక్కున నెలవై వాగ్దేవిగ..
నా కలమున అక్షర సుమమై
హరిచందన పరిమళాలు వెదజల్లగ
నా శిరమున అక్షరాల అక్షితలు జల్లి
ఆశీస్సులీయవమ్మ..అంజలి ఘటింతునమ్మ
మరిమరి వేడెద అమ్మా భార్గవి
వరముల నీయ వడివడి రావా వైష్ణవీ