రచన-: విజయ గోలి
ప్రక్రియ-: వచన కవిత
శీర్షిక-:త్రిపురాత్మిక
సర్వాభీష్ట దాయని శైలపుత్రీ
భండాసుర వధోద్యుక్తా బాలా
త్రిపురావస్థ నియంత్రితా త్రిపురాత్మికా
సర్వ బీజ సంస్థితా సర్వ సుందరీ
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవీ నమోస్తుతే
షోడశ విద్యాధి దేవతా
అక్షర మాలాధరి సర్వ మంగళా
అర్ధచంద్రాయుధ పాణి శైలపుత్రీ
వృషభవాహినీ త్రిపురేశ్వరీ నమోస్తుతే
కరుణామయి చైతన్య చిద్రూపిణి
శివాత్మికా దాక్షాయణీ
త్రిశూల ధారిణి సర్వ సంరక్షణి
త్రిమూర్తి స్వరూపా నమోస్తుతే
పంచాక్షరీ పరమ పావనీ
అక్షర చైతన్య వరములిచ్చి
ఆదుకో మము ఆనంద దాయని
అఖిలాండేశ్వరి అమ్మా నమోస్తుతే