కవనసకినం

శ్రీ మల్లినాధసూరి కళాపీఠం. ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 5/10/2020
అంశం-:కవన సకినం. కలనైనా అనుకోలేదు
నిర్వహణ-:శ్రీమతి గీతాశ్రీ స్వర్గం గారు
రచన-:విజయ గోలి

కలతల్లో కరుగుతున్న కమనీయ బంధాల్ని
కన్నీటిలోన కదిలేటట్టి కన్నియల ప్రాణాల్ని
కల్లలుగ నిలుపుతున్న భవితలోని ఆశల్ని
సింహంగా మొరుగుతున్న శునకపు కేకల్ని

కరోనాయె కాలుడిగా కదంతొక్కి వస్తుందని
కాలానికి కళ్ళెమేసి గమనంనూ ఆపునని
కాలుష్యపు కారుచిచ్చై పడగెత్తే సర్పమని
కలనైన అనుకోలే కాలుతున్న భారతాన్ని

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language